16 June, 2026 | 6:02 PM

గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంచి ఫలితాలు

16-06-2026 05:10 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 100% ఫలితాలు సాధించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి జాదవ్ అంబాజీనాయక్ తెలిపారు. మంగళవారం గిరిజన ఆశ్రమ పాఠశాలలో సందర్శించి ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థికి ఉచితంగా నోటు పుస్తకాలు వర్కు బుక్కులు అందించాలన్నారు. మెనూ ప్రకారం భోజనం ప్రతిరోజు అందించాలని పాఠశాల నిర్వహణ లోపాలు తలెత్తితే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ గిరిజన పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుకారం ఉపాధ్యాయులు గజ్జరం సిబ్బంది పాల్గొన్నారు.