13 May, 2026 | 11:15 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు పోలీసు అధికారులు, సిబ్బందికి యోగా తరగతులు

28-11-2025 06:40 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు శుక్రవారం పోలీస్ అధికారులు,సిబ్బందికి యోగా తరగతులను నిర్వహించారు. ఈ తరగతులలో కొత్తగూడెం సబ్ డివిజన్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది,ఆర్మడ్ రిజర్వు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

నిత్యం విధులలో నిమగ్నమై ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్ శాఖలోని అధికారులు,సిబ్బంది శారీరక దృఢత్వంతో పాటు,మానసికంగా కూడా దృఢంగా ఉండే విధంగా చేయడంలో భాగంగానే యోగా తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ తెలిపారు. యోగా,ధ్యానం వంటిని అలవాటుగా చేసుకుని నిత్యం సాధన చేస్తే మానసిక ప్రశాంతతతో పాటు దైనందిన కార్యక్రమాలలో ఉత్సాహంగా,చురుకుగా పాల్గొనవచ్చని డిఎస్పీ అన్నారు. కావున పోలీసు అధికారులు , సిబ్బంది తమ ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ తరగతుల ఆవశ్యకత తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.