6 May, 2026 | 9:59 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

యామాద్రి కవితను గెలిపించాలి

09-02-2026 01:20 AM

ఆర్మూర్‌లో ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి

అర్మూర్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మూడో వార్డులో బీజేపీ అభ్యర్థి యామాద్రి భాస్కర్ కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి కోరారు. ఆదివారం మూడో వార్డులో ఎమ్మెల్యే పర్యటించి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థి కవితతో పాటు వార్డులో కలియ తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేసి కార్నర్ మీటింగ్‌లో  పాల్గొన్నారు. ఆర్మూర్ అభివృద్ధి జరగాలంటే బిజెపితోనే సాధ్యమని అన్నారు.

రాజకీయ అనుభవం ఉన్న కవితకు పట్టం కట్టాలని కోరారు. కవితను గెలిపించుకుంటే వాడు అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మూడో వార్డు అభ్యర్థి యామాద్రి భాస్కర్ కవిత మాట్లాడుతూ ఆడపడుచునైన తనకు ఆశీర్వదించి మున్సిపల్ లో కూర్చోబెట్టలని ఆమె కోరారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎంపీ అరవింద్ ల సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు పుప్పాల శివరాజ్ కుమార్, యామాద్రి భాస్కర్, కృష్ణ గౌడ్,  వివేక్, సుదర్శన్, లింగోజి, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.