calender_icon.png 9 February, 2026 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

09-02-2026 01:19:30 AM

20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ

సదాశివపేట, ఫిబ్రవరి 8: సదాశివపేట మున్సిపాలిటీ 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిపల్లి అంజమ్మ సత్యనారాయణకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం ప డుతున్నారు. ఆదివారం గడపగడపకు ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అధికారంలో ఉన్నది కాంగ్రెస్.. అభివృద్ధి చేసేది కాంగ్రెస్ అని తెలిపారు. ఒక సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కు టుంబంలో జన్మించిన వ్యక్తినని, కష్టసుఖా లు తనకు తెలుసని అన్నారు.

గత పది సంవత్సరాలు బిఆర్‌ఎస్ ప్రభుత్వం సదాశివపేట కు చేసింది ఏమి లేదని, 20వ వార్డులో కూ డా ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపా రు. ఈసారి తనకు అవకాశం ఇస్తే ఖచ్చితం గా అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని, బిఆర్‌ఎస్ పార్టీ వ్యక్తులు ఇచ్చే ప్రలోభాలకు మోసపోవద్దని అవి శాశ్వతం కావని అభివృద్ధి మాత్రమే శాశ్వతం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  సహకారంతో వార్డుని అన్ని విధాల అభివృద్ధి పరు స్తారని ఆయన అన్నారు. తమకు ప్రజలు ప్రచారానికి వెళితే కచ్చితంగా మీకు గెలిపిం చి తీరుతామని ప్రజలు హామీ ఇస్తున్నారని చెప్పారు.