calender_icon.png 22 February, 2026 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాజా కిచెన్ హోటల్ ఆహారంలో పురుగులు

21-02-2026 12:00:00 AM

హోటల్‌ను తనిఖీ చెయ్యని ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు

సికింద్రాబాద్, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): సికింద్రాబాద్ తార్నాక ప్రాంతంలోని ప్రముఖ తాజా కిచెన్ హోటల్లో ఆహా రంలో పురుగు కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక వినియోగదారుడు రెండు ఇడ్లీలు, ఒక వడ ఆర్డర్ చేయగా వాటిలో బొద్దింక కనిపించినట్లు ఆరోపించారు. వెంటనే హోటల్ సిబ్బందికి సమా చారం ఇవ్వగా, విషయం బయటకు రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి.

పురుగు గురించి ప్రశ్నించగా హోటల్ మేనేజర్ తమ కిచెన్ ఎంతో పరిశుభ్రంగా ఉంటుందని, రోజూ శుభ్రపరిచే ప్రక్రియలు పాటిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఆ వినియోగదారుడు కిచెన్ను స్వయంగా పరిశీలించగా అక్కడ కూడా ఇలాంటి జలపురు గులు కనిపించాయని ఆరోపించారు. దీంతో హోటల్ పరిశుభ్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఆరోగ్య ప్రియుల్లో ఆందోళన కలిగించింది.

ప్రతిరోజూ వందలాది మంది ఆహారం తీసుకునే హోటళ్లలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.