25 July, 2026 | 5:40 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

బీసీలకు రిజర్వేషన్ల అమలు జరిపాకే ఎన్నికలు

21-02-2026 12:00 AM
  1. లిబర్టీ చివరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిరసన ప్రదర్శన

వందలాది మందితో దద్దరిల్లిన లోయర్ ట్యాంక్ బండ్

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో బీసీలకు 42% చట్టబద్ధంగా కల్పించిన తర్వా తే ఎన్నికలు జరపాలని జాతీయ బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటే ష్ ముదిరాజ్,

బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ల సతీష్ కుమార్ సమన్వయంతో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలలో బీసీలకు 42 శాతం చట్టబద్ధంగా రిజర్వే షన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ లిబర్టీ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వ హించారు. అనంతరం ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ మాట తప్పిందని ఆరోపించారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీసీలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం కల్పించిన తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ భారీ నిరసన ప్రదర్శన కార్యక్రమంలో రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు జి. అనంతయ్య, రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పల్లగొర్ల మోడీ రాందేవ్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, బీసీ సంఘం నాయకులు భీంరాజు అంజి గౌడ్, శివకుమార్ యాదవ్, నరేష్ గౌడ్ పాల్గొన్నారు. 

హైకోర్టులో 42 శాతం కేసును తొందరగా విచారణ చేపట్టాలి

హైకోర్టులో నడిచే కేసు బలంగా ఉందని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జీవో 9 ఉన్నదని ఎంపీ ఆర్. కృష్ణయ్య తెలిపారు. పెంచిన రిజర్వేషన్ల కేసు గెలుస్తుందన్నారు ఈ కేసును తొందరగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.