వాడివేడిగా మున్సిపల్ సమావేశం
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపల్ సమావేశం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల మధ్య వివాదం మధ్య వాడి వేడిగా ముగిసింది. అభివృద్ధి విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ సమావేశంలో చర్చించారు. నిర్మల్ మున్సిపాలిటీకి ప్రభుత్వపరంగా నిధులు వస్తున్న అధికార పార్టీ నేతలు తమ వార్డుల్లోనే అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నారని బిజెపి కౌన్సిలర్లు ఆరోపించారు.
కాంగ్రెస్ కౌన్సిలర్లు అడ్డు చెబుతూ నిర్మల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వైఖరి కారణంగానే అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని ఆరోపించారు. టిఆర్ఎస్ ఎంఐ పార్టీ నాయకులు రాజకీయాలు మాని పట్టణ అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి మున్సిపల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి కమిషనర్ రవిబాబు అధికారులు పాల్గొన్నారు.






