21-02-2026 12:00:00 AM
సికింద్రాబాద్, ఫిబ్రవరి (విజయక్రాంతి): కంటోన్మెంట్ ఐదవ వార్డు గాంధీ నగర్ బస్తీ లో దివంగత నేత ఎమ్మెల్యే జి. సాయన్న మూడవ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదవ వార్డ్ అధ్యక్షుడు కిరణ్, జనరల్ సెక్రెటరీ పెంటా శ్రీహరి, రావుల సతీష్ దివంగత నేత సాయన్న
చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివా ళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మల్ల ప్ప, విజయ్, బానప్ప, నాగరాజు, రామలింగప్ప, మహేష్, భీమ్, సాయప్ప, రిచర్డ్, రవి, యాదగిరి, అనిల్ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.