20 August, 2026 | 3:48 AM

అయిజలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

20-08-2026 12:00 AM

అయిజ ఆగష్టు 19: అయిజ మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మండల ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి తహసిల్దార్ జ్యోతి, ఎస్త్స్ర గురుస్వామి ముఖ్య అతిథులుగా హాజరై ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యూ రే ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు శ్వేత, హారిక సూపర్వైజర్ ఓబులేసు, మండల ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ రామకృష్ణ, మల్లికార్జున్, తిరుమలేష్ మొదలగువారు పాల్గొన్నారు.