చర్లపటేల్‌గూడ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో మంచిరెడ్డి దంపతులు
20-08-2026 12:00 AM
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 19 (విజయ క్రాంతి): ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామాంజనేయ దేవాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది మహోత్సవంలో‘ రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి వారి సతీమణి శ్రీమతి ముకుందమ్మ వారి కుమార్తె శీతల్ రెడ్డి పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ టేకులసుదర్శన్ రెడ్డి, బి ఆర్‌ఎస్ నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






