శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
ఘట్‌కేసర్, ఆగస్టు 19 (విజయక్రాంతి) : పోచారం డివిజన్ పరిధిలోని 1000 సంవత్సరాల చరిత్ర గల శ్రీస్వయంభు శ్రీబాలాజీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం నిర్వహించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రణీత్ కుమార్, ఆలయ ఈవో ఎల్. భాగ్యలక్ష్మి పాల్గొని నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
నూతన ఆలయ కమిటీ చైర్మన్గా నీరడి కుమార స్వామి, డైరెక్టర్లుగా చెరుకూరి కృష్ణ , రాయబండ అరుణ్ తేజ్, దొంతు శైలజ, ముగుళ్ల లక్ష్మీ ప్రసన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు.
ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఆలయ మాజీ చైర్మన్లు ఉదారి వేణుగోపాల్, చింతపంటి సత్తయ్య, అశోక్, నాయకులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బండ్లగూడ నగేష్ గౌడ్, మెట్టు గణేష్ యాదవ్, బద్దం నర్సింహ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, భోజిరెడ్డి, నర్సింగ్ రావు, మంచాల సుధాకర్, కందుల కుమార్, బద్దం కుమార్, తదితరులు పాల్గొన్నారు.






