20 August, 2026 | 2:37 AM

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

20-08-2026 12:40 AM

బోధన్,ఆగస్టు 19(విజయ క్రాంతి): బోధన్ ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ సీఐ వెంకట నారాయణ, అసోసియేషన్ సభ్యులు ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగుర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు, అసోసియేషన్ ప్రతినిధులు కలసి పేదలకు అన్న వితరణ చేశారు.

బోధన్ టౌన్ స్టూడియో అసోసియేషన్ ఆధ్వర్యంలో..

బోధన్, ఆగస్టు 19 (విజయ క్రాంతి): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్ టౌన్ స్టూడియో అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు, ఫోటో స్టూడియో నిర్వాహకులు, వీడియో ప్రతినిధులు, ఫోటోగ్రఫీ ప్రియులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫోటోగ్రఫీ రంగంలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం చింతకుంట వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు నిత్యావసర వస్తువులను అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఒక మంచి ఫోటో కేవలం ఒక దృశ్యాన్ని చూపించదు.. ఒక జ్ఞాపకాన్ని, ఒక భావాన్ని, ఒక కథను శాశ్వతంగా నిలుపుతుంది అని పేర్కొన్నారు. కెమెరా ద్వారా ప్రతి క్షణాన్ని అందమైన జ్ఞాపకంగా మలుస్తున్న ఫోటోగ్రాఫర్లకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ స్టూడియో అసోసియేషన్ అధ్యక్షులు మురళి కటికల, ఉపాధ్యక్షులు శంకు గణేష్, సెక్రటరీ అనీల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎర్ర శ్రీకాంత్, మల్లెపూల భాస్కర్, క్యాషియర్ కె. ఉమాకాంత్, ఏ. మధు, గౌరవ అధ్యక్షులు జి. అనీల్ గౌడ్, బి. ప్రభాకర్, కె. అశోక్, ఏ. పాండు తదితరులు పాల్గొన్నారు.