20 August, 2026 | 3:26 AM

యూరియా కోసం తిప్పలు

20-08-2026 12:39 AM

గంభీరావుపేట, ఆగస్టు 19 (విజయక్రా ంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం ఎదుట యూరియా కోసం రైతులు చెప్పులు క్యూ కట్టి ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపించింది. పీఏసీఎస్ ఆన్‌లైన్ యాప్ ద్వారా 1132 యూరియా సంచులు అందుబాటు లో ఉంచడంతో రైతులు ముందుగానే బుకింగ్ చేసుకున్నారు.

దీంతో తెల్లవారుజాము నుంచే రైతులు గోదాం వద్దకు చేరుకుని యూరియా కోసం నిరీక్షించారు. చాలా మంది గోడలపై కూర్చుని గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. యాప్‌లో బుకింగ్ చేసినప్పటికీ సమయాని కి సరఫరా లేకపోవడంతో ఇంతకాలం వేచి ఉండాల్సి వస్తుందా అంటూ రైతులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.