దోమల నివారణకు ఫాగింగ్ ప్రారంభం
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో దోమల నివారణకు మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం ఫాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ ప్రజలకు దోమల బెడద నుంచి విముక్తి కల్పించడంతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్ల పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉండే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, కార్యదర్శి గూరుడు శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు ముష్కరి రమేష్, కొంపెల్లి రాకేష్, అరికుప్పల రాజం, ముత్యాల గంగారాజం, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్‌రెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.






