రోజు వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు
19-08-2026 04:49 PM
గుంతలు పడి ఇబ్బంది పడుతున్న వాహనదారులు
రోడ్డు మరమ్మతు చేయండి
కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామ బస్టాండ్ ప్రధాన రహదారి తారు రోడ్డు చెడిపోయి, గుంత ఏర్పడి వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు అనేక ఇబ్బందులు,అవస్థలు పడుతున్నారు. ప్రతి రోజు వేల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్, వేములవాడ నుండి కొండగట్టు,జగిత్యాల పోతుంటాయి.ఏదో విధమైన ప్రమాదం లేక తృటిలో తప్పే ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళలో గుంత కనబడక ద్విచక్ర వాహన దారులు కింద పడుతున్నారు. అలాంటి గుంతలు ప్రధాన రహదారి గుండా చాలా ఉన్నాయి. రోడ్డు గుంతలు లేకుండా మరమ్మతులు చేయాలని వాహనదారులు, ప్రజలు అధికారులను కోరుచున్నారు.






