19 August, 2026 | 5:30 PM

పేదవాడి సొంతింటి కల.. ఇందిరమ్మ ఇండ్ల పథకం

19-08-2026 04:32 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా మండలంలోని రాఘవపల్లి గ్రామంలో అర్హులైన నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లబ్ధిదారుల కోసం భూమి పూజ చేయడం జరిగిందన్నారు. రాఘవపల్లి గ్రామానికి చెందిన పసుల్లాడి సంతోష, దామరచర్ల రణీల, మలావత్ శోభి, మలావత్ శాంతలకు మంజూరైన నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచ్  నార్ల గంగమణి మల్లేష్,ఆత్మ కమిటీ డైరెక్టర్ పసులది క్రిస్టఫర్,మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దివిటీ కిష్టయ్య,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగుల మోహన్లు గ్రామస్తులతో కలిసి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నార్ల గంగమని మల్లేష్ మాట్లాడుతూ... లబ్ధిదారులు త్వరగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభించి నాణ్యతతో నియమ నిబంధనలు పాటిస్తూ కొలతల ప్రకారం పనులు చేపట్టాలని సూచించారు.రాఘవపల్లి గ్రామంలో అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా కలలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.