19 August, 2026 | 5:29 PM

నాగిరెడ్డిపేటలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

19-08-2026 04:37 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మండల ఫోటో,వీడియో గ్రాఫర్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ పితామహుడు “లూయిస్- జాకాస్ మండే డాగురె “ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం మండల ఫొటో, వీడియో గ్రాఫర్స్,అధ్యక్షుడు షేక్ రియాజ్ ,తెలంగాణ ఫోటో, వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం జెండాను ఆవిష్కరించారు.ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె ఫొటోగ్రఫీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి,సేవలను కొనియాడారు.