19 August, 2026 | 5:29 PM

మహిళా భవనానికి భూమి పూజ

19-08-2026 04:42 PM

నంగునూరు,(విజయక్రాంతి): గ్రామాల్లో మహిళల సంక్షేమం కోసం నూతనంగా నిర్మించనున్న మహిళా భవనానికి బుధవారం మైసంపల్లిలో భూమి పూజ నిర్వహించారు.ఈ భవన నిర్మాణంతో మహిళా సంఘాలకు సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎంతో సౌలభ్యంగా ఉంటుందని  సర్పంచ్ సోమిరెడ్డి నరేష్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతోనే మహిళా భవనానికి భూమి పూజ చేసామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్,కార్యదర్శి, వార్డు సభ్యులు,మహిళలు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.