25 April, 2026 | 3:31 PM

ప్రపంచ మలేరియా దినోత్సవంపై అవగాహన ర్యాలీ

25-04-2026 01:58 PM

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): ప్రజల భాగస్వామ్యంతో మలేరియాను పూర్తిగా అంతం చేయాలని జిల్లా ఇంచార్జి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. రవికుమార్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో అవగాహన ర్యాలీని ప్రారంభించారు.

జ్వరం వచ్చినప్పుడు సమీప ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్ష చేయించుకోవాలని, మలేరియా నిర్ధారణ కోసం అవసరమైన ఆర్‌డీటీ కిట్లు అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, డ్రై డే పాటించడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టవచ్చని సూచించారు. కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.