5 June, 2026 | 11:08 PM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత..

05-06-2026 09:58 PM

*  ఉట్నూర్ కోర్టు సివిల్ జడ్జి మౌనిక

ఉట్నూర్,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉట్నూర్ కోర్టు జడ్జి మౌనిక అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని  ఉట్నూర్ కోర్టు ఆవరణలో న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా  జెడ్జి మౌనిక మాట్లాడుతూ.. మానవ మనుగడకు  ప్రకృతి ప్రధాన ఆధారమని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి  వాటిని సౌరక్షించి  పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి  కాలుష్య నివారణకు కృషి చేయాలని సూచనలు చేశారు.