3 July, 2026 | 1:41 PM

మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్ కె.హరిత

03-07-2026 12:42 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): స్వయం సహాయక మహిళా సంఘాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. మండల సమైక్య భావన ప్రారంభోత్సవ కకార్యక్రమానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపును పెంపొందించుకుని, రుణాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని సూచించారు. సంఘాల సభ్యులు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుని అదనపు ఆదాయం పొందేలా ముందుకు సాగాలని అన్నారు.మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడటానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక ప్రోత్సాహం , సంఘాల సభ్యులు సమాఖ్యల ఆధ్వర్యంలో చేపడుతున్న ఉపాధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మి సూచించారు. మహిళలు ఐక్యంగా పనిచేస్తే కుటుంబాభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధికి కూడా దోహదపడతారని పేర్కొన్నారు.