3 July, 2026 | 1:42 PM

​బిఆర్ఎస్ నాయకుడికి పరామర్శ

03-07-2026 12:41 PM

 జైపాల్ రెడ్డి మాతృమూర్తికి రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి ఘన నివాళి

​మాడ్గుల, జులై 3(విజయక్రాంతి):బిఆర్ఎస్ పార్టీ  మాడ్గుల మండల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి మాతృమూర్తి ఎమి రెడ్డి పెద్ద లక్ష్మమ్మ గురువారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం మాడుగుల మండలం, చంద్రాయన్‌పల్లి గ్రామంలోని జైపాల్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ లక్ష్మమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి 

​ఈ సందర్భంగా దివంగతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రార్థించారు. అనంతరం జైపాల్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ పరంగా తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. నివాళి కార్యక్రమం మరియు పరామర్శలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, సింగిల్ విండో చైర్మన్ ​తిరుమల్ రెడ్డి, నాయకులు లాలయ్య,​కృష్ణారెడ్డి, యాది రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి – పోశయ్య – అవురుపల్లి సర్పంచ్ యాదయ్య, కొండల్ రెడ్డి – వార్డు సభ్యులు పాల్గొన్నారు.