21 April, 2026 | 4:08 AM

పోషణ్ పక్వాడాతో షోషకాహార లోపానికి చెక్

21-04-2026 12:00 AM

ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ప్రశాంతి 

నాగల్ గిద్ద, ఏప్రిల్ 20: నాగల్ గిద్ద మండలంలోని మోర్గి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సోమవారం పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల ప్రయోజనాలు, వినియోగంపై నాగలిగిద్ద మండలం అంగన్వాడి సూపర్వైజర్ ప్రశాంతి అవగాహన కల్పించారు.

  రక్తవృద్ధి ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెరుగడంతోపాటు జీవక్రీయ మెరుగు పర్చడంతో శరీరం సమర్ధవంతగా పనిచేస్తుందన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ మల్గే అన్నపూర్ణతో సూపర్వైజర్ ప్రశాంతి, అంగన్వాడీ టీచర్లు కలిసి గర్భిణీలకు సీమంతం చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్గే అన్నపూర్ణ శివశరణప్ప, అంగన్వాడీ టీచర్లు సవిత ,సమాధాన, హెల్పర్లు చంద్రమ్మ, పద్మ, గర్భిణులు పాల్గొన్నారు.