1 July, 2026 | 2:50 AM

అంకితభావంతో పనిచేస్తే సమాజంలో గుర్తింపు

01-07-2026 01:54 AM

నిర్మల్ జూన్ 30 (విజయక్రాంతి): ఏ ఉద్యోగి అయినా విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న పలువురు ఉద్యోగులను సన్మానం చేసి వీడ్కోలు చెప్పారు. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ఉద్యోగులు జీవితంలో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి ఉపేందర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు.