31 August, 2026 | 1:08 PM

పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

31-08-2026 11:56 AM

రామగిరి మండలం అధ్యక్షుడిగా బండారి సదానందం

రామగిరి, ఆగస్టు 31 (విజయ క్రాంతి): రామగిరి మండలం పద్మశాలి సేవా సంఘం నూతన మండల కార్యవర్గాన్ని ఆదివారం సాయంత్రం రాణి రుద్రమదేవి స్టేడియం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడిగా బండారి సదానందం ఎన్నిక కావడంతో సంఘ సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.

నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా బండారి సదానందం, ఉపాధ్యక్షుడిగా చిలువేరు స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు వైకుంఠం ఎన్నికయ్యారు. అలాగే గౌరవ అధ్యక్షుడిగా ఎల్లే రామ్మూర్తిని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బండారి సదానందం మాట్లాడుతూ పద్మశాలి సమాజ అభ్యున్నతి, సంఘ సభ్యుల సంక్షేమం, సమాజంలో ఐక్యత సాధనకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మండలంలోని పద్మశాలి కుటుంబాలందరినీ కలుపుకుని సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. పేద కుటుంబాల సంక్షేమం, యువత అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ అందరి సహకారంతో ముందుకు సాగుతామని అన్నారు.

నూతన కార్యవర్గం ఏర్పాటుతో మండలంలో పద్మశాలి సేవా సంఘం కార్యకలాపాలు మరింత విస్తృతం కానున్నాయని సంఘ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సత్తయ్య, రామగిరి మండల మాజీ అధ్యక్షులు కుంట శ్యామ్, నాయకులు దంతుల రవి, బైరి శంకర్, కుంట చక్రి తదితరులు పాల్గొన్నారు.