1 July, 2026 | 2:49 AM

చిన్నారి రాంసాయి నటన అద్భుతం

01-07-2026 01:52 AM

నిర్మాత నేరెళ్ల దేవేందర్

వెంకటాపూర్, జూన్ 30 (విజయ క్రాంతి): షైన్ స్టూడియో బ్యాన్ప రూపొందుతున్న ప్రొడక్షన్ నెం.2 సినిమా చిత్రీకరణ మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతోంది. ఈ చిత్రంలో హీరో అజయ్ చిన్ననాటి పాత్రలో నటిస్తున్న హన్మకొండలోని బాలసముద్రానికి చెందిన ఐదో తరగతి విద్యార్థి కోడిపాక రాంసాయి తన సహజ నటనతో చిత్ర యూనిట్ను ఆకట్టుకున్నాడని నిర్మాత నేరెళ్ల దేవేందర్ తెలిపారు.

మంగళవారం జవహర్నగర్ సమీపంలోని నందిపాడులో చిత్రీ కరించిన సన్నివేశాల్లో రాంసాయి సింగిల్ టేక్లో డైలాగులు చెప్పి ప్రేక్షకులను, చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచాడన్నారు. హీరో చిన్ననాటి పాత్ర కోసం నిర్వహించిన ఆడిషన్లో రాంసాయిని ఎంపిక చేశామని, ఎలాంటి సినీ అనుభవం లేకపోయినా పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటిస్తున్నాడని కొనియాడారు. భవిష్యత్తులో అతడు మంచి నటుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

సినిమా చిత్రీకరణ ఇప్పటికే 50 శాతం పూర్తయిందని, మరో నెల రోజుల పాటు ములుగు జిల్లాలోనే షూటింగ్ కొనసాగుతుందని నిర్మాత వెల్లడించారు. చిత్ర నిర్మాణానికి సహకరిస్తున్న జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత వేణు యాదవ్, హీరో అజయ్, హీరోయిన్ అశ్విత, దర్శకుడు నేరెళ్ల దేవేందర్, సహాయ దర్శకుడు ఆర్య అరవింద్, గేయ రచయిత రాజ్కుమార్, డీఓపీ తరుణ్, ఎడిటర్ యూనిక్, అసిస్టెంట్ డైరెక్టర్ లోకేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గౌతమ్తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.