నేరెళ్ల హాస్టల్ వద్ద కారు, ఆటో ఢీ.. ఒకరికి గాయాలు
31-08-2026 12:02 PM
తంగళ్ళపల్లి ఆగస్టు 31(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల హాస్టల్ వద్ద కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు ప్రమాదకరంగా మారడంతో ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించక ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న ప్రమాదకర చెట్లను వెంటనే తొలగించాలని గ్రామపంచాయతీ అధికారులు, హాస్టల్ యాజమాన్యాన్ని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






