13 March, 2026 | 3:05 AM

కార్మికుల పక్షపాతి కావూరి

13-03-2026 01:17 AM
  1. సిరిసిల్లపై ప్రత్యేక చొరవ
  2. కావూరి సాంబశివరావుకు కేటీఆర్ సంతాపం
  3. ప్రజలకు కావూరి విశేష సేవలు 
  4. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  5. కావూరి గొప్ప ప్రజానాయకుడు: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): కార్మికుల పక్షపాతి కావూరి సాంబశివరావు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అ న్నారు. గురువారం కేంద్ర మాజీ మంత్రి కావు రి సాంబశివరావు నివాసానికి కేటీఆర్ వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా కావురి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, ప్రగాఢ సానుభూతిని తెలి యజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కావురి సాంబశివరావుతో తనకున్న పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

2009లో కేసీఆర్ నిరాహార దీక్ష అనంతరం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఉద్యమాలు ఉవ్వెత్తు న ఎగిసిపడిన కాలాన్ని ఆయన గుర్తు చేశారు. కావురి సాంబశివరావు సిద్ధాంతపరంగా గట్టి సమైక్యవాది అయినప్పటికీ, తన నియోజకవర్గమైన సిరిసిల్ల పట్ల ఆయన చూపిన చొరవ ను కేటీఆర్ కొనియాడారు. ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో కూడా కేంద్ర జౌళి శాఖ మంత్రిగా కావురి సాంబశివరావు సిరిసిల్లలో పర్యటించారని కేటీఆర్ పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో కార్మికులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తన నివాళులు అర్పించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు శ్రీని వాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాగంటి సునీత గోపీనాథ్ ఉన్నారు. 

సేవలు మరువలేనివి: రాంచందర్‌రావు

రైతు కుటుంబంలో జన్మించిన కావూరి సాంబశివరావు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు విశేషమైన సేవలు అందించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి కావూరి సాంబశివరావు నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. కావూరి కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేశారు. యువతకు ఉపా ధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో 1984 లోనే స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించారని, అవి తర్వా త కాలంలో అనేక ప్రభుత్వాలకు మార్గదర్శకంగా మారాయని తెలిపారు. 

ప్రజలకు తీరని లోటు: పీవీఎన్ మాధవ్

కావూరి సాంబశివరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని, ఆయన గొప్ప ప్రజా నాయకుడని పీవీఎన్ మాధవ్ తెలిపారు. కృ ష్ణా, గోదావరి నదుల జలాలను పూర్తి స్థాయి లో వినియోగించుకోవాల్సిన అవసరంపై కావూరి పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడిన నాయకుడన్నారు. ఎక్కడా వివాదాలకు తావులేకుండా అజాతశత్రువుగా పేరుపొందారని, రాజకీయాల్లో మంచి వ్యూహకర్తగా గుర్తింపు పొందారన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికినీ అనేక విషయాలపై తమకు మార్గదర్శనం చేసేవారని గుర్తు చేశారు.