కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్
22-04-2026 06:54 PM
మిర్యాలగూడ,(విజయక్రాంతి): గ్రామపంచాయతీలలో సేవలందిస్తున్న అంగన్వాడీ, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, VOAలు, మధ్యాహ్న భోజన కార్మికులు, స్వీపర్లు, స్కావెంజర్ల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రవినాయక్ అన్నారు. బుధవారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ స్థాయిలో కీలక సేవలు అందిస్తున్న కార్మికుల సమస్యలతో పాటు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పింఛన్ సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లను అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, ఇంద్రపల్లి సైదమ్మ, మంజుల, శాంతి,మంగమ్మ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






