18 August, 2026 | 7:04 PM

ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి

18-08-2026 06:31 PM

కొమురవెల్లి,(విజయక్రాంతి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డివైఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ అన్నారు. ఈనెల 20 న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమ సన్నహాక సమావేశ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను  భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాదిమంది ఉన్నత విద్యను అభ్యసించి, నిరుద్యోగులుగా మారుతున్నారన్నారు.

యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్న  నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. మోడీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 12 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఉద్యోగాలు కల్పించకుండా యువతను మోసం చేసిందన్నారు. ఈనెల 20న నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు స్వర్గం శ్రీకాంత్, తాడూరి ప్రవీణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.