18 August, 2026 | 6:58 PM

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అప్పగింత

18-08-2026 06:33 PM

గణపురం,(విజయక్రాంతి): గణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైన మొబైల్ ఫోన్‌ను పోలీసులు భద్రపరిచి, అసలు యజమానిని గుర్తించి తిరిగి అప్పగించారు. లభ్యమైన మొబైల్ ఫోన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించిన గణపురం పోలీసు సిబ్బంది నగరంపల్లి గ్రామానికి చెందిన గొర్రె వాసు ను యజమానిగా  గుర్తించారు.

అనంతరం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, ఫోన్ తనదేనని నిర్ధారించుకున్న తర్వాత మంగళవారం ఎస్ఐ బొరగల అశోక్ అతనికి మొబైల్ ఫోన్‌ను అప్పగించారు. మొబైల్ ఫోన్‌ను తిరిగి పొందిన బాధితుడు గణపురం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.