18 August, 2026 | 7:51 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అదృశ్యం

18-08-2026 07:00 PM

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లి

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఓ బాలిక అదృశ్యమైన సంఘటన  జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... వేముల అనూష కుటుంబం జవహర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. అనూషకు 14 సంవత్సరాల వయసు గల కుమార్తె వేముల సాయి ప్రియ(అలియాస్ గంగ) మానసిక వైకల్యంతో బాధపడుతూ మాట్లాడడంలో ఇబ్బంది పడుతూ ఉంది. ఈ మేరకు సాయి ప్రియ ఈనెల 17వ తేదీన ఉదయం 8:30 గంటలకు తల్లి పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయింది.

తల్లి అనూష సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసి ఉండడంతో పాటు కుమార్తె కనిపించలేదు. ఈ మేరకు తల్లి సాయి ప్రియ గూర్చి చుట్టుపక్కల వెతికినా తెలిసిన వారి వద్ద వెతికినా బంధువుల వద్ద వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు తల్లి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయి ప్రియ ఆచూకీ తెలిసినట్లయితే ఈ కింది ఫోన్ నంబర్ లైన 8712 662027 లేక 871266 2103 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.