28 August, 2026 | 2:41 AM

ఏడాదైనా మరమ్మతులు చేయరా?

28-08-2026 01:25 AM
  1. కామారెడ్డిలో గతేడాది రోడ్లు నీటమునక 
  2. మరమ్మతులకు డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నిరసన

కామారెడ్డి, ఆగస్టు 27 (విజయక్రాంతి): గతేడాది వర్షాకాలంలో కాలనీలు నీటమునిగి రోడ్లు ధ్వంసమైనా నేటికీ మరమ్మత్తులు చేపట్టకపోవడం శోచనీయమని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. ఆయా సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా గురువారం కామారెడ్డిలో బీఆర్‌ఎస్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో సీఎంకు పిండ ప్రధానం నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరువరుసల రోడ్డు సైతం చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోయిందన్నారు. ఇప్పటివరకు దానికి మరమ్మతులు చేపట్టలేదని నిలదీశారు. సీఎం అలసత్వానికి నిదర్శనమన్నారు. వెంటనే రహదారి పునరుద్ధరణ చేపట్టకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని గోవర్ధన్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, కౌన్సిలర్లు అరకల ప్రభాకర్ యాదవ్, మామి ళ్ళ లక్ష్మణ్, ఆఫీస్, కుంభాల రవి యాదవ్, గరిగంటి లక్ష్మీనారాయణ, పోలీస్ కృష్ణాజీరావు, బల్వంత్‌రావు, పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కొత్తింటి శ్రీనివాస్ రెడ్డి, భానుప్రసాద్ పాల్గొన్నారు.