7 March, 2026 | 10:05 AM

బలోపేతానికి మహిళా సమైక్య భవనాలు

06-03-2026 09:09 PM

కొల్చారం,(విజయక్రాంతి): మహిళా సంఘాల బలోపేతానికి ప్రతి గ్రామంలో మహిళా సమైక్య భవనాలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని నర్సాపూర్  ఎమ్మెల్యేవాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం నాడు మండల పరిధిలోని సంగాయిపేట పైతర యనగండ్ల గ్రామాలలో పర్యటించి మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహిళా సంఘాల అభివృద్ధికి కొరకు మహిళలకు తక్కువ వడ్డీకి డ్వాక్రా రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. డ్వాక్రా మహిళలు ప్రతినెల సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి గ్రామంలో 10 లక్షల రూపాయలతో మహిళా సమైక్య భవనాల నిర్మాణం చేపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాబన్నగారి రవితేజ రెడ్డి, సర్పంచులు పుర్రె కాంతమ్మ ఊశయ్య, కోరబోయిన లక్ష్మి పెంటయ్య, ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్, ఎంపీడీవో రఫిక్ ఉన్నీసా, బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా, మండలయువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు, నాయకులు పాశం శ్రీనివాస్ రెడ్డి,ముత్యం గారి సంతోష్ కుమార్, వెంకట్రాంరెడ్డి, అరిగే రమేష్ కుమార్, భాను ప్రకాష్ రెడ్డి,సురేష్ గౌడ్, ధనరాజ్, వివిధ గ్రామాల నాయకులు మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.