రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహించాలి
17-07-2026 09:20 PM
- పదోన్నతి పొందిన పోలీసులకు సీపీ సూచన
సిద్దిపేట క్రైం: పోలీస్ శాఖలో పదోన్నతులు హోదాతోపాటు మరింత బాధ్యతను పెంచుతాయని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు. ప్రమోషన్ పొందిన అధికారులు రెట్టింపు ఉత్సాహంతో, ప్రజా సేవే పరమావధిగా విధులు నిర్వహించాలని కోరారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి జి.మొగిలి నాయక్, బి.రాములు కె.సంజీవ్ రెడ్డి, బి.జనార్ధన్ ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు. వారిని కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం సీపీ అభినందించారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, బాధ్యత, మరియు విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయని చెప్పారు.






