7 March, 2026 | 3:42 AM

నగరంలో చైన్ స్నాచింగ్ కలకలం

06-03-2026 09:05 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో శుక్రవారం ఉదయం ఏడు గంటలకు చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. మామిండ్ల నవ్య అనే మహిళ తన ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై అక్కడికి వచ్చి, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడి నుండి పరారయ్యారు.

ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.