హైడ్రాలో మహిళా దినోత్సవం
మహిళా ఉద్యోగులు బహుమతులు అందజేసిన హైడ్రా కమిషనర్
సికింద్రాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): హైడ్రాలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. మధ్యాహ్నం వరకూ విధుల్లో ని మగ్నమై ఉన్న మహిళలు,కార్యాలయం వదిలిపెట్టే ముందు సమావేశమ య్యారు. ఇక అంతే సందడి మొదలైంది. ఓ వైపు మహిళల సాధికారతపై ప్రసంగాలు, మరో వైపు సందడి కార్యక్రమాలతో సమావేశ మందిరం ఆహ్లాదంగా మారింది. మ్యూ జికల్ చైర్ ఆటలో చురుకుగా పాల్గొన్నారు. ర్యాంప్ వాక్లో పోటీ పడ్డారు. ఓ వైపు సంగీతం,మరోవైపు నృత్యం మహిళా దినోత్సవ వేడుకలకు హైలెట్గా నిలిచాయి.
ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అందజేశారు. కార్య దక్షతతో పాటు సమర్ధవంతమైన నాయకత్వ లక్షణాలతో మహిళలు రాణిస్తున్నారని హైడ్రా కమిషనర్ కొనియాడుతూ అన్ని రంగాల్లో పోటీపడు తు న్నారు అనే దశ నుంచి విజేతలుగా నిలుస్తున్నారనే దశకు మహిళలు చేరారని రంగనాథ్ అన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అదనపు కమిషనర్ ఆర్. సుదర్శన్ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.




