9 May, 2026 | 1:19 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

బతుకమ్మను ఘనంగా నిర్వహించుకున్న మహిళలు

29-09-2025 10:29 PM

చివ్వెంల (విజయక్రాంతి): ఈరోజు చివ్వెంల మండలంలోని అక్కలదేవిగూడెం గ్రామం పూల పండుగ సద్దుల బతుకమ్మతో సందడిగా మారింది. తెల్లవారుజామున నుంచే మహిళలు పూలు ఏరుకొని, అందంగా బతుకమ్మలు పేర్చి, పాటలు పాడుతూ, ఆటలాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ చుట్టూ వాతావరణం పండుగలా మారి, చిన్నారుల కిలకిలలు, మహిళల జానపద గీతాలు, పూల పరిమళం, గ్రామాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి.

మహిళలను ప్రోత్సహించేందుకు టిఫిన్ బాక్సులు బహుమతిగా అందజేయడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి దాతలుగా మండవ ఎల్లయ్య, అమరగాని వీరయ్య, మండల లక్ష్మి సహకరించగా, ప్రతి సంవత్సరం ఇలా మహిళలకు బహుమతులు అందించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామ పెద్దలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు మండవ రాము, మండల కోటేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది విశేష కృషి చేశారు. వారికి గ్రామ పెద్దలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామమంతా పూల పరిమళం వెదజల్లగా, జానపద గీతాలు, ఆటల సందడి బతుకమ్మ వేడుకకు మరింత శోభను తీసుకొచ్చాయి.