9 May, 2026 | 12:41 PM

Breaking News

ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   స్వీయ గణనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి   •   వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగించాలి   •   వేసవి క్రీడా శిక్షణ ముగింపు   •  

పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

09-05-2026 11:38 AM

భిక్కనూర్, మే 09(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన బండి రేణుక (సుమారు 35) గిర్ని దుకాణాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైనట్లు స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. రేణుక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.