9 May, 2026 | 2:18 PM

Breaking News

మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •  

దుర్గామాత మండపంలో నోట్ పుస్తకాల పంపిణీ

29-09-2025 10:27 PM

చిట్యాల (విజయక్రాంతి): దుర్గామాత మండపంలో ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ సోమవారం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో నార్కట్పల్లి మండలం చౌడంపల్లి  గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన గ్రామంలోని చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 8వ రోజు శ్రీ సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం ఇవ్వగా దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఎంతో మహిమ కలిగిన శ్రీ కనకదుర్గమ్మ తల్లిని భక్తిశ్రద్ధలతో కొలవాలని, దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరి పైన ఉండాలని, రైతులు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో పాడిపంటలతో విలసిల్లాలని ఆయన వేడుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కమిటీ సభ్యులు చెరుకుపల్లి వినయ్ కుమార్, గణేష్, విష్ణు, సురేష్,శివకుమార్, విశ్వతేజ, విగ్నేష్, రోహిత్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.