నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య
09-05-2026 11:40 AM
టేకులపల్లి, (విజయక్రాంతి):టేకులపల్లి మండలం బోడు గ్రామంలో శనివారం నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సైలు రాజేందర్, శ్రీనివాస్ రెడ్డి, బోడు సర్పంచ్ స్వరూప-సుధీర్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో నాభి శిల ప్రతిష్ట సందర్భంగా బంధువులతో గ్రామం కలలాడింది.






