calender_icon.png 5 February, 2026 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు ‘పోష్’ చట్టం తెలిసి ఉండాలి

05-02-2026 12:17:53 AM

  1. పని స్థలాల్లో లైంగిక వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు

జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్‌ఖాన్

నస్పూర్, ఫిబ్రవరి 4: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పని ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధించే వారిపై  ‘పోష్’ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు. మహిళలు లైంగిక వేధింపుల నిరోధక చట్టం ‘పోష్’ యాక్ట్ 2013పై అవగాహన కలిగి ఉండాలని, పని ప్రదేశాలలో మహిళలకు భద్రత, గౌరవం, సమానత్వం కల్పించడమే లక్ష్యంగా చట్టం రూపొందించారని తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలలో, వాణిజ్య, వ్యాపార సముదాయాలలో, షాపింగ్ మాల్స్, జిన్నింగ్ మిల్లులు, ఇతర పని ప్రదేశాలలో పని చేసే మహిళలు లైంగిక వేధింపులకు గురైతే బాధిత మహిళలు నిర్భయంగా అంతర్గత ఫిర్యాదు కమిటీకి ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చన్నారు.

జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఇప్పటి వరకు 47 అంతర్గత ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో ప్రభుత్వ జిల్లా స్థాయి కార్యాలయాల లో 30 కమిటీలు, ఉప జిల్లాస్థాయి కార్యాలయాలలో 16, ప్రైవేట్ సంస్థలు, షాపింగ్ మాల్స్, దుకాణాలలో ఒక కమిటీ పని చేస్తుందని తెలిపారు. ప్రైవేట్ సంస్థలు తమ సంస్థలలో కమిటీలను ఏర్పాటు చేసి జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయం, షీ బాక్స్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.