28 August, 2026 | 6:48 PM

Breaking News

రాఖీ కట్టుకో... హెల్మెట్ పెట్టుకో అన్న

28-08-2026 02:39 PM

చలానా కాదు.. రాఖీ కట్టి రోడ్డు భద్రతపై అవగాహన

కామారెడ్డిలో ట్రాఫిక్ పోలీసుల వినూత్న మూగ అవగాహన

కామారెడ్డి,ఆగస్టు 28(విజయక్రాంతి): రాఖీ కట్టుకో... హెల్మెట్ పెట్టుకో అన్న అంటూ ట్రాఫిక్ మహిళ పోలీసులు(Women traffic police personnel) వినూత్నంగా శుక్రవారం కామారెడ్డిలో వాహనదారులకు అవగాహన కల్పించారు. చాలానా కట్టడం ముఖ్యం కాదు కుటుంబం గురించి భద్రతగా ఉండు, అంటూ అవగాహన కల్పించారు. రాఖీ పండుగ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా వాహన దారులకు అవగాహన కల్పించడం వాహన దారులను విస్తూ గొలుపేలా  చేసింది. సాధారణంగా హెల్మెట్ లేకుండా వానం నడిపే వారికి చాలానా విధించే పోలీసులు ఈసారి నిర్మాణ అంటే చైతన్యానికి అవగాహన కు ప్రాధాన్యత ఇస్తూ రాఖీ కట్టి బాధ్యతను గుర్తు చేశారు. కామారెడ్డి డిఎస్పి మధుసూదన్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్ గౌడ్, ఎస్ ఐ వినయ్ సాగర్, మహిళా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పోలీస్ స్టేషన్ ఎదుట వాహనదారులకు రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా వినూత్నంగా అవగాహన కల్పించారు.

హెల్మెట్ లేకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు మహిళ ట్రాఫిక్ పోలీసులు బొట్టు పెట్టి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు(Happy Rakhi Festival) తెలిపారు. అనంతరం హెల్మెట్ పెట్టుకో నీ కుటుంబం నీకోసం ఎదురు చూస్తుందంటూ సందేశం అందించారు. మీ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలంటూ ప్రేమతో కూడిన సందేశాన్ని అందించారు. హెల్మెట్ ధరించడం(Wearing helmet) కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాదని ప్రతి ద్విచక్ర వాహనదారుడు ప్రాణ రక్షణకు సంబంధించిన బాధ్యతని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదాన్ని తగ్గించడంతో ప్రాణాలను కాపాడడంలో హెల్మెట్ కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. రాఖీ బంధం భద్రత బంధం అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం వాహనదారులను ఎంతో ఆకట్టుకుంది. నిబంధనలు లేని వారికి జరిమానాలు విధించడం ద్వారా మాత్రమే కాకుండా ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పై అవగాహన కల్పించడం ద్వారా శాశ్వత మార్పు తీసుకురావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు తెలిపారు.