28 August, 2026 | 7:17 PM

30న తుంగతుర్తిలో ఉచిత కంటి వైద్య శిబిరం

28-08-2026 02:40 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): అక్షర ఫౌండేషన్ – సూర్యాపేట, శంకర కంటి ఆస్పత్రి – హైదరాబాద్ ఆధ్వర్యంలో, స్వర్గీయ సంకినేని కమలమ్మ – రామారావు జ్ఞాపకార్థం, ఎస్.కె.ఆర్. కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరం కరపత్రాలను సంకినేని రవీందర్ రావు, తుంగతుర్తి గ్రామ సర్పంచ్ సాయిబాబా  విడుదల చేశారు.ఈ సందర్భంగా సంకినేని రవీందర్ రావు మాట్లాడుతూ, తుంగతుర్తి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు కంటి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శంకర కంటి ఆస్పత్రి, హైదరాబాద్ వైద్య నిపుణులచే శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించబడతాయని చెప్పారు.కంటి సమస్యలు ఉన్నవారిని పరీక్షించి, ఆపరేషన్ అవసరమైన అర్హులైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేపించబడునని తెలిపారు. శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు.

ఈ ఉచిత వైద్య శిబిరం 30-08-2026, ఆదివారం ఉదయం 9:00 గంటలకు, తుంగతుర్తి రామాలయం గుడి దగ్గర ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల భవన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.తుంగతుర్తి గ్రామంతో పాటు, పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరై ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వారు ఉచిత ఆపరేషన్ సేవలను పొందాలని సంకినేని రవీందర్ రావు  కోరారు.