మందకృష్ణ మాదిగ పోరాటంతోనే వికలాంగులకు హక్కుల సాధన
ఇకనైనా వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవే ర్చాలి: తిప్పారపు లక్ష్మణ్ మాదిగ
మల్కాజిగిరి,(విజయక్రాంతి): వికలాం గులకు ఎన్నికల సమయం లో ప్రభుత్వం ఇచ్చిన హామీ లను వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఇంచార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి చౌరస్తాలో వికలాంగుల హక్కుల పోరాట సమితి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షు డు ఎన్ వినయ్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎం.జె.ఎఫ్ రాష్ట్ర నాయకులు మనో హర్ హాజరై జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాదిగ, వినయ్ మాదిగ మాట్లాడుతూ, వికలాంగుల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ 19 ఏళ్ల క్రితం విక లాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమాన్ని నిర్మించారని తెలిపారు. ఆ ఉద్యమం ద్వారా వికలాం గులకు అనేక హక్కులు, ప్రయోజనాలు సాధించా మన్నారు. ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్‌ను పెంచి అందిం చాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు చట్టసభలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజ ర్వేషన్లు కల్పిస్తున్న విధంగానే వికలాంగులకు కూడా వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పిం చాలని కోరారు. వికలాంగు లకు దక్కాల్సిన హక్కులు, వాటా సాధించే వరకు భవిష్యత్తులోనూ ఉద్యమా లను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్ర మంలో లక్ష్మణ్ కుమార్, బి.రజిత,ఎం వెంకటేష్, బి.నరసింహ,ఈశ్వరయ్య, అజిరా బేగం,సూరజ్, ప్రకాష్, మనోహర్,ఎస్.కీర్తి, తదితరులు పాల్గొన్నారు.






