12 April, 2026 | 4:20 AM

సామాజిక చైతన్యానికి ఫూలే పునాది

12-04-2026 12:29 AM
  1. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

మాజీ డీజీపీ డాక్టర్ జే పూర్ణచంద్రరావు

మీడియా సెంటర్‌లో ఘనంగా ఫూలే జయంతి

నివాళులర్పించిన పలువురు

హైదరాబాద్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిరావ్ ఫూలే మహిళలు, పీడి త వర్గాలకు విద్య అందించడం ద్వారా ఆయ న చేసిన పోరాటం సమాజ మార్పునకు బాటలు వేసిందని మాజీ డీజీపీ డాక్టర్ జే.పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. ఫూలే సామాజిక అసమానతలే దేశ ప్రజలను బంధిస్తున్న అసలు సంకెళ్లు అని గుర్తించిన మహానుభావుడన్నారు. కుల వివక్ష, విద్యా లేమి, సామాజిక వెలివేతలను తొలగించకుండా వచ్చిన స్వాతంత్య్రం కొద్దిమందికే లాభం చేకూరుస్తుందని ఫూలే భావించారని తెలిపారు.

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా శనివారం లక్డీకాపూల్‌లోని మీడియా సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఫూలేకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సమాజాలకు చెందిన లక్ష్మణ్, విజయకుమార్, శివరాజ్, చంద్ర శేఖర్, పవన్ కుమార్, కవిత, సుచరిత, తరుణ్ పలువురు నాయకులు హాజరయ్యారు. బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బాల గంగాధర్ తిలక్ గురించి ప్రస్తా విస్తూ, బ్రిటిష్ పాలననే దేశ అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా భావించిన తిలక్ స్వరాజ్యాన్ని అత్యవసర లక్ష్యంగా నిర్దేశించారని చెప్పారు. రాజకీయ అధికారమే ముందుగా రావాలని, ఆ తర్వాత సమాజంలో సంస్కరణలు సహజంగా రావాలని ఆయన అభిప్రా యం వ్యక్తం చేసినట్లు వివరించారు.

అయితే తిలక్ అనుకున్న విధంగా మార్పులు రాలేదని కుల వివక్ష సామూహిక ఆర్ధిక రాజకీయ రంగాల్లో పెరిగిందని ఆయన బీసీలకు చట్ట సభల్లో జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం లేదని ఆదివాసీలు ముస్లింలకు దళిత క్రిషియన్లకు అన్యాయం జరుగుతున్నదని అన్నా రు. సామాజిక న్యాయం లేకుండా రాజకీయ స్వాతంత్య్రం నిలవదని అంబేద్కర్ హెచ్చరించారని, సమానత్వం, ఆత్మ గౌరవం, సౌభ్రాతృత్వం అనే విలువలపై నిలిచిన ప్రజాస్వామ్యమే స్థిరంగా ఉంటుందని చెప్పారు.రాజ్యాంగం ద్వారా ఈ విలువలను స్థిరపరిచిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు.

జ్యోతి బా అంబేద్కర్ ఆలోచనలను సమగ్రంగా పరిశీలిస్తే, ఫూలే సామాజిక చైతన్యానికి పునాది వేసారని, అంబేద్కర్ సమానత్వంపై ఆధారపడిన ప్రజాస్వామ్యాన్ని నిర్మించారని డా. పూర్ణచంద్రరావు విశ్లేషించారు.రాజకీయ స్వాతం త్య్రం, సామాజిక సంస్కరణలు పరస్పరం అనుసంధానమైనవని, ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణమని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్ర ఫలితాలు ప్రతి వ్యక్తికి చేరుతున్నాయా, ఇంకా కొనసాగుతున్న అసమానతలను నిర్మూలిస్తున్నామా అన్న ప్రశ్న లను ప్రతి పౌరుడు తనను తాను ప్రశ్నించుకోవాలని పిలుపునిచ్చారు.

దేశ సంపదలో మూడవ వంతు 211 బిలియనీర్ల చేతిలో ఉండడమే అసమానత్వానికి నిదర్శమని అన్నారు. అమరావతి రాజధానిని కమారావతి అని రేణుకాచౌదరి పార్లమెంట్ సాక్షిగా అనడం కుల అహంకారానికి ప్రతీక అని జ్యోతిబా అటువంటి భావజాలానికి వ్యతిరేకంగా పోరాడదని ఆయన అన్నారు.

సంగెం సూర్యారావు మాట్లాడుతూ జ్యోతిబాఫూలే మార్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు నడవాలని ఆయన కన్న కలలు నిజం చేయాలని రాజ్యాధికారం సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ డీఆర్‌ఓ సూర్యనారాయణ, రిటైర్డ్ ఏసీపీ నారాయణ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాజీ కానిస్టేబుల్ సిద్దిపేట బహుజన నాయకుడు శ్రీశైలం,చెన్న రాములు ఇంకా పలువురు పాల్గొన్నారు.)