2 September, 2026 | 9:36 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

లైబ్రేరియన్ రాజారాంకు సన్మానం

30-06-2026 | 03:28pm

నిర్మల్,(విజయక్రాంతి): మామడ మండల కేంద్రంలో లైబ్రేరియన్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన పగడం రాజారాంను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజారాం తన సేవా కాలంలో గ్రంథాలయ అభివృద్ధికి విశేష కృషి చేసి, విద్యార్థులు, యువతలో చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

ఆయన సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా పాల్గొని యువతకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆకాంక్షించారు. గ్రంథాలయ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొని రాజారాంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.