9 May, 2026 | 12:40 PM

Breaking News

ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   స్వీయ గణనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి   •   వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కొనసాగించాలి   •   వేసవి క్రీడా శిక్షణ ముగింపు   •  

బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు

09-05-2026 11:37 AM

దేవరకొండ,(పెద్దవూర)విజయక్రాంతి: పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామంలో మూడు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో నిరుపేద కుటుంబానికి చెందిన బొడ్డు కిరణ్ ఇల్లు దగ్ధమైంది. కరెంటు వైర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటిపై మంటలు చెలరేగి భారీ నష్టం సంభవించింది. ఈ ఘటన తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. రిటైర్డ్ హెచ్‌ఎం వడ్లపల్లి నర్సిరెడ్డి రూ.5,000లు, పోతునూరు కాంటెస్ట్ సర్పంచ్ రేపాకుల సాయికుమార్ యాదవ్ రూ.3,000లు సహాయం చేశారు.

అలాగే గ్రామ మూడో వార్డు సభ్యుడు చిలువేరు శివ రూ.1,000, నాలుగో వార్డు సభ్యుడు మద్దూరి వెంకటేశ్వర్లు రూ.1,000, ఐదో వార్డు సభ్యుడు తుమ్మ సంజీవ రూ.1,000, ఏడో వార్డు కాంటెస్ట్ సభ్యుడు తరి నరేష్ 25 కేజీల బియ్యం అందజేశారు. గ్రామానికి చెందిన బురం వెంకటేశ్వర్లు యాదవ్ రూ.1,000 ఆర్థిక సహాయం చేశారు.ఈ సందర్భంగా కాంటెస్ట్ సర్పంచ్ రేపాకుల సాయికుమార్ యాదవ్ మాట్లాడుతూ బాధిత కుటుంబ పరిస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.