మహిళ దారుణ హత్య
* హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
* కేసు నమోదు చేసిన పోలీసులు
పాపన్నపేట: మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన ఏడుపాయల ఆలయం సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని కొడుపాక గ్రామానికి చెందిన బ్యాగరి సులోచన(35) కొన్నేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో అప్పటి నుంచి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. మెదక్ లో కూలీ పనులకు వెళ్తూ జీవిస్తుంది. కాగా సోమవారం ఉదయం ఇంట్లో నుంచి కూలీ పనుల కోసం వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఇంటి వద్ద ఉన్న కుమారుడు రాజేష్ బంధువులకు సమాచారం అందించాడు.
చుట్టూ పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు ఏడుపాయల సమీపంలోని చెలిమకుంట వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి ముఖంపై కర్రతో దాడి చేసిన బలమైన గాయం ఉండడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. మృతురాలి సోదరుడు దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.




