2 July, 2026 | 4:16 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు

02-07-2026 03:28 PM

కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్,

ఊరుకొండ, కల్వకుర్తి జూలై 2 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో అధికారులు ఎవరు ఎలాంటి నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ హెచ్చరించారు. ఈ నెల 4న నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండ మండల పరిధిలోని ఉరుకొండపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో కలిసి ఉరుకొండపేటలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి జరుగుతున్న ఏర్పాట్లను గురువారం పరిశీలించారు.  హెలిప్యాడ్ నుంచి ఆలయానికి ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గం, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆలయ ఈవో, అర్చకులతో సమావేశమైన కలెక్టర్, ముఖ్యమంత్రి నిర్వహించే ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు, పూర్ణకుంభ స్వాగతం, దర్శన ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

దేవాలయ దర్శనం అనంతరం ముఖ్యమంత్రి ఆలయ వెలుపల ఏర్పాటు చేసిన ప్రాంగణంలో కొంతమంది ప్రముఖులతో కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొననున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని, ప్రతి శాఖ తమకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం ఉరుకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి శాఖలవారీగా అప్పగించిన బాధ్యతలను మరోసారి సమీక్షించి అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని పేర్కొన్న కలెక్టర్, ఏ ఒక్క అధికారి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దేవ సహాయం, అరుణ రెడ్డి, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి డిఎస్పి వెంకట్ రెడ్డి ,ఆలయ ఈవో సత్య చంద్రా రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.